మా గ్రామాల పేర్ల చరిత్ర తెలుసుకోండి....!అంటున్న రాజధాని అమరావతి గ్రామాలు

 మా గ్రామాల పేర్ల చరిత్ర తెలుసుకోండి....!అంటున్న రాజధాని అమరావతి గ్రామాలు

అమరావతి ప్రాంత గ్రామా లు-రాజధాని గ్రామాల పేర్లు చరిత్రకు ఆధారాలుగా నేటికి సజీవంగా నిలిచా యి. అమరావతి రాజధాని ప్రకటనతో రాజధాని పరిధి లో ఉన్న 29 గ్రామాలతో పాటు అమరావతి సమీప గ్రామాల పేర్లు ఎలా ఉద్భ వించాయనేది ప్రధాన అంశంగా ఈ వ్యాసం రాయడింది. ఓ సారి చరిత్ర పుటల్లోకి వెళితే వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది. అమరావతిలో ఉన్న 29 గ్రామాలలో కొన్ని గ్రామాల పేర్లు నేటికి చరిత్రకు సాక్ష్యా ధారాలుగా ఉన్నాయి. అసలు ఇక్కడ ఉన్న గ్రామాల పేర్లు వెనుక ఉన్న చరిత్ర మనం తెలుసు కుందాం.
మొదటిగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా స్థానిక ఉద్దండరాయిని పాలెంలో అమరావతి శంఖుస్థాపన జరిగింది కదా...అసలు ఉద్దండరాయిని పాలెం ప్రాముఖ్యత ఏమిటి...?ఉద్దండరాయిని పాలెం పేరు ఎలా వచ్చింది అనేది పరిశీలిస్తే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి న శ్రీ కృష్ణదేవరాయలు ఆనాడు అమరావతిని పాలించారు.ఈ క్రమంలో రాయల వారి కొలువులో ఉద్దండరాయుడు అనే వ్యక్తి గొప్ప సేనానిగా ఉండేవాడు. అంతేకాదు ఇతను శ్రీ కృష్ణదేవరాయ లకు అత్యంత ప్రీతి పాత్రుడు. శ్రీకృష్ణదేవ రాయల వారి సామ్రాజ్య విస్తరణలో ఉద్దండ రాయుడు కీలకపాత్ర పోషించాడు.ఇక యుద్ధ విషయా ల్లో ఉద్దండరాయు డు బాగా ఆరితేరినవాడు. ఆంధ్రుల రాజధాని అమరా వతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం ఆయన పేరు మీద ఏర్పడి న గ్రామం కావడమే ఇక్కడ విశేషం.
ఈ నేపథ్యంలో విజయ నగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నాడు కొండపల్లి వెళ్లడానికి ముందు యుద్ధ విరామ సమయంలో శ్రీకృష్ణదేవ రాయలు బస చేసిన ప్రాంతం నేటి రాజధాని గ్రామం రాయపూడి.కాల క్రమంలో నాడు రాయలు పూడిగా పేరున్న ఆ గ్రామం నేడు రాయపూడిగా పిలువబడుతుంది.ఇక రాయల సేనాని ఉద్దండ రాయుడు యుద్ధకాలంలో బస చేసిన ప్రాంతమే నేడు ఉద్దండ రాయునిపాలెంగా అమరావతి రాజధాని శంఖుస్థాపన జరిగిన ప్రాంతంగా చరిత్రకెక్కింది.
ఇక తుళ్ళూరు విషయానికి వస్తే రాయల వారు 'తులు' వంశస్థులు కావడం తో నాడు రాయలు ఆధీనంలో ఉన్న ప్రధాన కేంద్రంని అప్పట్లో 'తులూరు' గా నామకరణం చేశారు. ఇప్పుడు అది కాలక్రమేణా తుళ్లూరుగా రూపాంతరం చెందింది.ఇక మరో రాజధాని గ్రామం అబ్బరాజు పాలెం విషయా నికి వస్తే రాయల వారికి సామంతుడుగా ఉన్న అబ్బరాజు పేరిట అబ్బ రాజుపాలెం...అలాగే మరో సామంతుడు వెంకటప్ప పేరిట వెంకటపాలెం గ్రామా లు అవతరించాయి.
అలాగే కాకతీయ సామ్రాజ్య వీర వనిత రాణీ రుద్రమదేవి కూడా ఓరుగల్లు సామ్రాజ్య విస్తరణలో భాగంగా నాటి ధాన్యకటకం నేటి అమరా వతిని వశం చేసుకుని పాలించారు. రాణీ రుద్రమదేవి పాలనకు గుర్తుగా అమరావతి లో తుళ్ళూరు తరువాత మరో ప్రధాన ప్రాంతంగా పిలువ బడుతున్న నేటి మందడం గ్రామం నాడు మందారం గా పేరు గాంచింది.ఇక రుద్రమదేవి పాలనకు ఆధారాలు ఈ మందడం గ్రామాన్ని ఆనుకుని ఉన్న మల్కాపురం,వెలగపూడి గ్రామాల మధ్య ఓ 12-15 అడుగుల ఎత్తు రెండు, రెండున్న అడుగుల చుట్టుకొలత కలిగిన పెద్ద రాతి శాశనం రుద్రమదేవి పాలనలో ఆమె ఏర్పాటు చేయటం జరిగింది.ఇక్కడ ఈ రాతి శాశనం ఓ ప్రత్యేక తను కలిగి ఉంది.శాశనం పై భాగాన ఓ నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఈ నంది ప్రాముఖ్యత ఏమంటే... శాశనం పైనున్న నంది అమరావతి ప్రాంతానికి జల జీవనాధారమైన కృష్ణానది వైపు చూస్తు న్నట్లుగా శాశనం పై నందిని ఏర్పాటు చేసి అమరావతి ఎందుకు ఆంధ్రుల రాజ ధానిగా ఉంది.అమరా వతిని రాజవంశీకులు కృష్ణానది ఒడ్డున ఎందుకు ఏర్పాటు చేశారు అనే దానికి సూచికగా ఈ శాశనం ఏర్పాటు చేయటం జరిగింది. నాడు ఏర్పాటు చేసిన ఈ శాశనం రుద్రమ దేవి వేసిన 'మందార' శాశనంగా పిలువబడేది. ఈ శాశనం ఉన్న ప్రాంతమే కాల క్రమేణా మందార అనే పేరు కాస్తా వాడుక భాషలో మందడంగా రాజధాని గ్రామమైన మందడం కు ఈ పేరు వచ్చింది.అయితే నేడు ఆ శాశనం ఏ ప్రభు త్వాల ఆలనా- పాలనా లేకుండా ఉండగా నాడు అమరావతి అనేది రాజ వంశీకుల పాలనలో ఉండేది అని చెప్పుకోవ డానికి తప్ప ఇప్పుడు ఆ చారిత్రక శాశనం సమాధు లకు పునాది రాయిలా మిగిలి కరిగి పోతున్న కాలంలో నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిఉంది.
ఇక అమరావతిలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో నేటి అమరావతి గ్రామమై న నవులూరు కేంద్రంగా నాడు 'నావ'ల ద్వారా పాలకులు జలరవాణా కూడా చేయడం జరిగింది. అమరావతి గ్రామాలను ఆనుకుని ఉన్న కృష్ణానది ముంపు నివారణ కు ఆనాడు ఏ విధమైన కరకట్ట లేక పోవడంతో కృష్ణానది, రాజధాని గ్రామాలలో ఒకటైన నవులూరు వరకు విస్తరించి ఉండేది.ఈ క్రమంలో నవులూరు లో గల నదీతీర ప్రాంతంగా ఉన్న కృష్ణానదిపై ఈవలి నుండి ఆవలి ప్రాంతాలకు, నాటి అమరావతికి ముఖ్యంగా ఇటుకలతో పాటు మరి కొన్ని ఉత్పత్తులు జలరవాణా అయ్యేవి. వీటిని రవాణా చేసేందుకు నవులూరు వద్ద పెద్ద ఎత్తున నది ఒడ్డున నావలు ఉండేవి.గ్రామంలో నావల కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతమే నాడు 'నావలూరు'గా పిలువ బడేది. కాల క్రమేణా ఇప్పుడు ఈ రాజధాని గ్రామం నావలూరు కాస్తా నవులూరు గా పేరు మారింది.
ఇక ఉండవల్లి విషయానికి వస్తే ఆ గ్రామానికి ఉండవల్లి అనే పేరు ఎలా వచ్చింది అనే ఆధారాలు లభించలేదు. కానీ అమరావతి ప్రాంతం లో ఎర్రబాలెం గ్రామం నుండి ఉండవల్లి గ్రామం వరకు సుమారు నాలుగైదు కిలోమీటర్లు పొడవున ఓ కొండ ఉంది. ఈ కొండ తూర్పు దిశ ప్రాంతమే ఉండవల్లి గ్రామం.ఇక్కడే దక్షిణ భారతంలో మొట్ట మొదటి గృహాల నిర్మాణం జరిగింది.అవే ఉండవల్లి గృహాలు.ఇక ఈ కొండపై క్రీ.పూ౹౹భౌద్ధ బిక్షవులు స్వతంత్ర నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోగా ఈ కొండపై వారి జీవనానికి గుర్తుగా కొన్ని నిర్మాణాలు కోనేరు,పెద్ద పెద్ద గోడల నిర్మాణాలు,వ్యవసాయం చేసిన ఆధారాలు వంటివి ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా పిలువబడు తున్న పూర్ణ కుంభం(పూర్ణ ఘట్టం) అనే దానిని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ పూర్ణ కుంభం పుట్టుక అమరావతి.నాటి శాత వాహనులు పాలనలో అమరావతి పాడిపంటలు, ధన-ధాన్యాలతో దేదీప్య మానంగా వెలిగి పోతు న్నందుకు గుర్తుగా అమరావతి ప్రాంతానికి చెందిన విధుకుడు అనే చర్మకారుడు అమరావతి ఎల్లకాలం ఇలాగే ఉండాలి అని శాతవాహన రాజుల ను అభినందిస్తూ పాడి పంటలు,ధన-ధాన్య రాశులు,పసుపు-కుంకుమా,పూలు అలాగే శుభాలు గుర్తుగా కొట్టే కొబ్బరికాయ వంటి వస్తువులను ఓ పాత్రలో అమర్చిన పూర్ణ ఘట్టాన్ని బహుకరించారు. ఇక ఈ చిహ్నాన్ని అమరావతి భౌద్ధ స్థూపాలలో ఏర్పాటు చేయాలని కోరటంతో నాడు అక్కడ భౌద్ధ స్థూపాల్లో ఈ చిహ్నం చేర్చారు. ఇక అమరావతి రాజ్యం మొత్తం ప్రధాన నిర్మాణాల్లో, ప్రముఖ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వచ్చింది. అలా పూర్వం నుండి వస్తున్న ఆ విధానాన్ని అమరావతిని ఎవరు పాలించినా ఆ పూర్ణ ఘట్టాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కాలానుగుణంగా నేటి అమరావతి గ్రామమైన ఉండవల్లి గృహల్లో ఇక్ష్వాకులు కూడా వారి కాలానికి ముందే చెక్కబడిన ఉండవల్లి గృహల్లో కూడా ఈ పూర్ణ కుంభాన్ని చెక్కారు. నాటికి-నేటికి అమరావతి వైభవానికి చిహ్నంగా ఉన్న ఈ పూర్ణ కుంభాన్ని ఈ తరం ప్రభుత్వాలు ఉండవల్లి గృహాల నుండి సేకరించారని చరిత్రకారు లు చెపుతున్నప్పటికి ఈ పూర్ణ కుంభం పుట్టుక అమరావతి లోనే ప్రస్తుతం ఈ పూర్ణ కుంభం ఇప్పుడు పూర్ణ ఘట్టంగా పిలువ బడుతుంది ఇక ఈ చిహ్నమే మన రాష్ట్ర చిహ్నంగా ప్రాచుర్యంలో ఉంది.కాబట్టి ఉండవల్లి అనే పేరుకు కూడా చరిత్ర నుండి ఉద్భవించినదిగా చెప్పాలి. అలాగే ఈ ఉండవల్లి పేరు వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత ఉండి ఉంటుంది.
మరో రాజధాని గ్రామం నిడమర్రు గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది.ఈ గ్రామంలో కూడా కొన్నేళ్ళ క్రితం కొన్ని చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పూర్వం అమరావతి రాజధానిగా ఉన్న వేళ కొందరు రాజ వంశీకులు నిడమర్రు, కురగల్లు గ్రామాలను పాలించారు. ఈ నేపథ్యం లో ఆ రోజుల్లో నిడమర్రు గ్రామం అమరా వతిలో ఓ బ్రాహ్మణుల అగ్రహారంగా ఉండేదని గ్రామ పొలాల్లో, పొలిమేర ల్లో బ్రాహ్మణులు పూజించే దేవుడు-దేవతా విగ్రహాల వెలుగు చూసిన ఘటన ద్వారా తెలుస్తుంది.ఇక నేటి రాజధాని గ్రామాలు నిడమర్రు,కురగల్లు,నీరుకొండ గ్రామాల పేర్లు ఎలా వచ్చాయి అంటే,నీడనిచ్చే మర్రిచెట్టు ఉన్న రాజధాని గ్రామం నిడమర్రు.నాడు నీడమర్రి అని పిలువబడిన గ్రామం కాలక్రమేణా నిడమర్రు అయ్యింది. అయితే మనం నిడమర్రు వెళితే గ్రామంలో రోడ్డు సెంటర్ లో ఉన్న మర్రి చెట్టు ఇప్పటికి మనకు నిడమర్రు గ్రామంలో కంటబడుతుంది.ఇక కురగల్లు గ్రామం కూడా రాజధానిలో భాగమే కుర అంటే 'చిన్న' గల్లు అంటే చిన్న 'కొండ రాయి' అని అర్థం. చిన్న కొండ రాయి గల ఊరు కురగల్లు. కుర గల్లు లో చిన్నపాటి కొండ ఇప్పటికి ఉన్నది.అలాగే మరో రాజధాని గ్రామం నీరుకొండ. ఈ నీరుకొండ చిన్నపాటి వర్షానికి కొండ చుట్టూ నీరు చేరుతుంది అలా నీరుకొండ అని పేరు వచ్చిందని నానుడి.ఇలా ఈ మూడు గ్రామాల పేర్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
ఇంకా చెప్పుకుంటే నాటి ధాన్యకటకం ఆధీనం లో ఉండి రాచరిక పాలన జరిగిన వేళ నుండి మరికొన్ని గ్రామాల పేర్ల ఆధారాలు లభించక పోయిన దేవతల నగరం అమరావతి అయితే మరో దేవతల గ్రామంగా వైకుంఠంపురం నేటికి ప్రాచుర్యం కలిగి ఉంది. పూర్వం దేవతలు కృష్ణా నది ఉత్తరాయణం పారే ప్రాంతంలో స్నానం చేసే వారని చెపుతున్న పురాణ గ్రంధాలకు నిలువెత్తు సాక్ష్యంగా అమరావతిలో అంతర్భాగంగా కృష్ణానది ఉత్తర దిక్కుకు పారుతూ కనిపించే వైకుంఠపురం కూడా ఓ చారిత్రక గ్రామంగా మనల్ని ఆకట్టుకుంటుంది.ఆలాగే అమరావతికి అతి సమీపంలో ఉన్న నరుకుళ్ల పాడుకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది చరిత్ర చెబుతుంది.నాడు అమరావతిని పాలించిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన రాజ్యంలో కరువు ఏర్పడిన వేళ అక్కడ నివాసం ఉన్న "చెంచులు" జాతీయులు అమరావతి రాజ్యంలో పెద్ద ఎత్తున దొంగతనాలు- దోపిడీలకు పాల్పడుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వేళ సుమారు ఓ 150 మంది చెంచులను వాసిరెడ్డి వారు ఎక్కడైతే వారిని నరికి ప్రజలకు రక్షణ కల్పించారో ఆ ప్రాంతాన్ని నరుకుళ్లపాడుగా పిలుస్తున్నారు.వెంకటాద్రి వారు పాలనలో జరిగిన ఈ ఘటనకు గుర్తుగా ఏర్పడిన గ్రామం నరకుళ్ళపాడు చరిత్ర చెప్పే సాక్ష్యానికి గుర్తుగా ఉంది.అయితే ఇదంతా స్థానిక ప్రజలు చెప్పుకునే కధనాల ద్వారా తెలుస్తుంది.ఇక కృష్ణాయ పాలెం,మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయం కలిగిన అనంతవరం,ప్రక్కనే ఉన్న నెక్కల్లు, వడ్లమాను, హరిశ్చంద్రపురం వంటి గ్రామాలు సైతం వాటి పేర్లు ఓ సారి పరిశీలిస్తే చరిత్రకు దగ్గరగా ఉన్నాయి.

Comments