ఈ దేశంలో ఈ అపర కుబేరుల్లో ఒక్క దక్షిణాది ఆయనే ఉన్నాడు. ఆయన కూడా బలహీన వర్గాలకు చెందిన ఆయన. ఈ దేశంలో ఈ సంవత్సరం అత్యధికంగా దానం చేసిన వ్యక్తులు శివ నాడార్ గారు. మన రాష్ట్రములో కులాల ప్రకారం చెప్పాలంటే వారు ఒక గౌడ/ఈడిగ/ గవళ్ల/శ్రీశయన /యాత/ శెట్టిబలిజ కులస్తులు. రెండవ ఎక్కువ దాతృత్వం చేసిన ఆయన అజీమ్ ప్రేమ్ జీ ఖోజా వర్గానికి చెందిన ఆయన. పై మాప్ లో అత్యధికులు గుమా వర్గానికి చెందిన వ్యక్తులు, మోషా గార్లకి అత్యంత ప్రియమైన వారు. అయితే పతంజలి సంస్థలో 99 శాతం షేర్లు గల ఈ దేశంలో అపరకుబేరుడిగా మారిపోయిన అమిత్ షా గారి సన్నిహితులు పండిత బాలకృష్ణ గారు ఈ లిస్టులో ఎందుకుని చోటు చేసుకోలేదో! అందరూ అనుకున్నట్లు పతంజలి సంస్థ లేదా అనుబంధ రుచి సోయాసంస్థల్లో రాందేవ్ బాబా యాదవ్ గారికి ఒక పైసా కూడా లేదు 99% షేర్లన్నీ ఎక్కడినుంచి వచ్చారో తెలియని బాలకృష్ణ గారి పేరు మీద ఉన్నాయనీ, కేవలం రాందేవ్ బాబా యాదవ్ గారిని ముఖతోడుగు/ బ్రాండ్ అంబాసిడర్ కింద మాత్రమే వాడుకుంటున్నారని విషయం చాలా మందికి తెలియదు. ఇక ఆ లిస్టులో నాడారుగారి మినహా ఈ దేశంలో 95% జనాభా కి చెందిన బి సి, ఎస్ టి, ఎస్ సి, మైనార్టీ లేదా ఒక్క శూద్ర వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఎవరూ లేరు. మహాత్మా ఫూలే, చత్రపతి సాహు మహారాజ్, బాబా సాహెబ్, ఈరోడ్డు వెంకటప్ప రామస్వామి నాయుడు, వేమన, త్రిపునేని రామస్వామి, తాపీ ధర్మారావు నాయుడు, గోపరాజు రామచంద్ర రావు, జాషువా ఆశయాలు ప్రజలందరూ అర్థం చేసుకునే రోజు రావాలని కోరుకుంటూ...
Comments
Post a Comment