బాలయ్య విజయేంద్రవర్మ సినిమా షూటింగ్ కేరళలోని చాలకుడి దగ్గిర మారుమూల ఫారెస్ట్ ఏరియాలో జరుగుతుంది. షూటింగ్ కి హరికృష్ణగారి కుమారుడు జానకిరామ్ తో ఇంజనీరింగ్ లో మా సీనియర్ విష్ణు కూడా వెళ్ళాడు...వర్షాలకారణంగా షూటింగు జరుగుతూ, ఆగుతూ ఉంది.... ఒకరోజు భారీవర్షంవల్ల షూటింగ్ సాధ్యపడలేదు....ఖాళీగా ఉన్న బాలయ్య, జానకిరామ్, విష్ణుతో కలిసి దగ్గిర్లో ఏదో డ్యామ్ ఉందని చూడ్డానికి బయలుదేరాడు....ఒక గిరిజన తండా దగ్గిరికొచ్చేసరికి జీప్ టైర్లు బురదలో కూరుకుపోయి ముందుకు కదల్లేక పోవడంతో తన యూనిట్ కి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా మొబైల్ సిగ్నల్ కూడా లేకపోవడంతో చేసేదేమిలేక అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టుకింద నిల్చుని వర్షం తగ్గుతుందేమో అని వేచిచూస్తున్నారు.... వీళ్ళని గమనిస్తూ అక్కడే ఉన్న గిరిజనులు వీళ్ళు ఆకలితో ఉంటారని గ్రహించి వాళ్ళకి చేపలతో వాళ్ళకి చేతనయిన వంటచేసి వీళ్ళకి తినడానికి తీసుకొచ్చారు.... జానకిరామ్, విష్ణు తినాలా వద్దా అని ఆలోచిస్తున్నా వాళ్ళ ఆప్యాయత మెచ్చి బాలయ్య వెంటనే తినడం మొదలెట్టాడు...ఇంతలో నలుగురు గిరిజనులు ఒక మహిళని కర్రలతో తయారుచేసిన కుర్చీమీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుండగా వీళ్ళ దగ్గిరికి వచ్చేసరికి స్పృహతప్పి పడిపోయింది....వెంటనే బాలయ్య లేచి ఏమైందని అడగ్గా కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతుందని చెప్పడంతో బాలయ్య ఫోన్ తీసుకొని కనీసం కొంచెమైనా సిగ్నల్ వస్తే తన యూనిట్ సభ్యులకి చెప్పి కారులో హాస్పిటల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం చెయ్యాలన్న తాపత్రయంతో దగ్గిర్లో చెట్టు కూడా ఎక్కి సిగ్నల్ కోసం చూసేలోపే ఆ మహిళ ప్రాణం విడిచింది....సరైన వైద్య సదుపాయంలేక మనిషి ప్రాణాలు పోతున్నా గిరిజనుల నిస్సహాయత చూసి చలించిపోయిన బాలయ్య మళ్ళీ మామూలుమనిషి కావడానికి మూడ్రోజులు పట్టింది...
తన కింకర్తవ్యమేమిటో తెలుసుకుని అక్కడినుంచే NTR Trust తో మాట్లాడి ఏం చెయ్యాలో చెప్పాడు...షూటింగు పూర్తవ్వడంతో తిరిగి Hyderabad చేరుకున్న మూడోరోజే ఆ గిరిజనుల తండా ముందు సకలసౌకర్యాలతో ఎన్టీఆర్ ట్రస్టు వారి అంబులెన్సు ఆగింది.... అది మొదలు ఈ 17 ఏళ్ళలో ఎంతమంది ప్రాణాలు కాపాడి ఉంటాడో తెలియదు కానీ కనీసం కొంతమందినయినా ప్రాణాపాయంనుంచి తప్పించి ఉంటాడు....
ఆ గిరిజనులకు బాలయ్య ఎవరో తెలియదు...బాలయ్యకి వాళ్ళెవరో తెలియదు....కానీ వాళ్ళ కష్టం చూసి స్పందించాడు....మానవత్వానికి కుల, మత, భాష, ప్రాంతంతో సంబంధం లేదని నిరూపించాడు....అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్న తన నియోజకవర్గ ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకుంటాడా?
********** HATSOFF బాలయ్యా************
Comments
Post a Comment